ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా...14 కోట్ల 6 లక్షల రూపాయల ఆదాయం

byసూర్య | Wed, Nov 24, 2021, 01:54 PM

హైదరాబాద్: ఆర్టీసీ సంక్షోభం నుండి బయటకు తీసుకువచ్చే చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా జీతాలు ఇవ్వలేని స్థాయి నుండి ఇప్పుడిప్పుడే మెరుగు పడేందుకు నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ తీసుకుంటున్న చర్యలు ఆ సంస్థకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

ఆయన నిర్ణయాలకు తోడుగా, కరోనా మహమ్మారి నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడడంతో..ఇటివలే పెళ్లిళ్లు ఫంక్షన్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఆదాయం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. గత చరిత్రలో ఎన్నడు లేనంతగా ఆర్టీసీ బస్సుల కోసం ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపిస్తుండడంతో ఆదాయం పెరిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.

ఈ క్రమంలోనే గడిచిన సోమవారం అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చింది. ఒక్కరోజులోనే రూ.14 కోట్ల 6 లక్షల రూపాయలు ఆదాయం గడించింది. కాగా ఆర్టీసీ చరిత్రలోనే ఇది అత్యధికంగా రికార్డు అయింది.కాగా ఆర్టీసీ చార్జీలు పెంచిన తర్వాత ఆర్టీసీ రోజులో 12 నుండి 13 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుండగా గడిచిన సోమవారం అధికంగా నమోదైంది. కాగా గతంలో ఈ రికార్డు 13 కోట్ల మూడు లక్షల రూపాయలు నమోదు అయింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎండీ సజ్జనార్ అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్సులకు ఆద్దెకు తీసుకున్న వారికి ప్రోత్సహకాలు ప్రకటించారు.. పెళ్లి చేసుకున్న నవవధువులకు ఆర్టీసీకి గుర్తుగా ఓ ఫోటోను బహుకరించారు. దీన్ని ప్రారంభించిన సజ్జనార్ నేరుగా ఓ పెళ్లికి వెళ్లి నూతన వధువరులకు గిఫ్ట్ ఇచ్చారు.. దీంతో ఆర్టీసీకి మరింత ప్రచారం పెరిగింది. బస్సుల ప్రయాణం సేఫ్‌తో ఖర్చుపరంగా కూడా కలిసి వస్తుండడంతో ప్రజలు ఆ వైపు దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టారు.

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM