అందమైన పాదాల కోసం పెడిక్యూర్ చేసికోండి ఇలా

byసూర్య | Wed, Nov 24, 2021, 01:40 PM

ఆడవారు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అందులో ముఖం మీద చూపే శ్రద్ధ ఐతే అంత ఇంత కాదు . ఇదే సమయంలో మెరుగైన అందం పొందటానికి ఒక ముఖం సరిపోదు . శరీరంలో కనబడే ప్రతి అవయవం కూడా  బాగుండేలా చూసుకోవాలి . వీటిలో ముఖ్యంగా మెడ , చేతులు మరియు పాదాలు . ఐతే వీటిని  కూడా కొన్ని పద్ధతుల ద్వారా అందంగా తయారుచేయొచ్చు తెలుసా ... ?
►పాదాలు : కొంత మంది పాదాలు మడిమలు పగిలి , నల్లగా చారలు కలిగి ఉంటాయి . వారి ముఖం ఎంత కాంతివంతంగా ఉన్నా, పాదాలు చూడటానికి చాల అసహ్యంగా ఉంటాయి . అలాంటి  వారికి పాదాలు చక్కగా , అందంగా తయారు చేసే పద్ధతినే "పెడిక్యూర్‌" అంటారు . ఈ పద్దతి వలన మీ పాదాలు చాల అందంగా తయారవుతాయి. పెడిక్యూర్ అనేది లాటిన్ భాషకి సంభందించిన పదం . పెడి  అనగా పాదం అని అర్థం . అందువలనే ఈ పేరు పలకటం జరుగుతుంది . ఇది ఎలా చేస్తారో చూద్దాం . ముందుగా కాలి గోర్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోర్లను అనుకున్న రీతిలో కట్‌ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనే, నిమ్మరసం షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్‌ స్టోన్‌  లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు.  తరువాత మర్దనా ఆయిల్‌ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్‌ చేస్తారు. చివరికి పాదాలను శుభ్రంగా తుడవడంతో పెడిక్యూర్‌ పూర్తవుతుంది. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మనకు మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి నెల , తరచుగా పెడిక్యూర్‌ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. ఈ పద్దతిలో ఉపయోగించిన వస్తువులు మీకు లభించినట్లైతే మీరు చక్కగా ఇంటి వద్దనే కూడా చేసుకోవచ్చు .
పెడిక్యూర్ విధానం లో రకాలు కూడా కలవు . మన పాదాల స్థితిని బట్టి ఆ పద్దతి ఉపయోగించడం మేలు . అందులో ముఖ్యంగా ,  క్లాసిక్‌ లేదా రెగ్యులర్‌ పెడిక్యూర్‌,
ప్రెంచ్‌ పెడిక్యూర్‌,జెల్‌ పెడిక్యూర్‌,పారఫిన్‌  పెడిక్యూర్‌,హాట్‌స్టోన్‌ పెడిక్యూర్‌,ఫిష్‌ పెడిక్యూర్‌,మిని పెడిక్యూర్‌,స్పా పెడిక్యూర్‌,ఐస్‌క్రీం పెడిక్యూర్‌,వాటర్‌ లెస్‌ పెడిక్యూర్‌,సాల్ట్‌ పెడిక్యూర్‌,చాక్లెట్‌ పెడిక్యూర్‌,అథ్లెటిక్‌ లేదా స్పోర్ట్స్‌ పెడిక్యూర్‌,మిల్క్‌ అండ్‌ హనీ పెడిక్యూర్‌వైన్‌, పెడిక్యూర్‌షాంఘై పెడిక్యూర్‌ .
పెడిక్యూర్ పద్ధతుల్లో పాదాలకు మసాజ్ చెయ్యడం , తేమతో కూడిన పొరను తొలిగించడం వలన పాదాలు అందంగా , కాంతివంతంగా తయారవుతాయి . 


Latest News
 

ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM
ముదిరాజుల సంక్షేమానికి పెద్దపీట: షబ్బీర్ అలీ Sat, Apr 20, 2024, 12:25 PM