సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామా వివాదంపై హైకోర్టులో విచారణ
 

by Suryaa Desk |

సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు.కాగా... ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. అలాగే వరి విత్తనాల అమ్మకుడదంటూ వెంకట్ రామి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ కంట్మెంట్‌లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డితో బేషరత్‌గా క్షేమపణల స్టేట్మెంట్ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM