అబద్దాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

byసూర్య | Mon, Nov 22, 2021, 02:48 PM

ఫాం హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో అంటే కుదరదు.. అందుకే ఇందిరా పార్కు లో దీక్ష చేసేందుకు వచ్చారు. ఇది ప్రజలు, రైతుల విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. '' మేం గతంలో కూడా చెప్పాం .. ప్రతి గింజా కొంటా అన్నాం. టీఆర్ఎస్ హుజూరాబాద్ ప్రజల తీర్పును తక్కువ చేసి చూపించేలా కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. అబద్దాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట అబద్దాల భవనాల్లో కేసీఆర్ కుటుంబం పాలన చేస్తోంది. సకల జనుల త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మిలియన్ మార్చ్.. సాగర హారం.. రైల్వే ట్రాక్ పై కూర్చునెందుకు కేసీఆర్ ఎప్పుడూ రాలేదు.. మేం స్వయంగా పాల్గొన్నాం.. అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.


 


అప్పుడు రాని ముఖ్యమంత్రి లెని సమస్య కోసం దర్నా చౌక్ కొత్త వచ్చాడు. మీ పార్టీ ని కాపాడేందుకు.. హుజూరాబాద్ ప్రజలను అవభానించేందుకు ధర్నా చేస్తున్నారు తప్పా రైతుల కోసం కాదు. ఏడేళ్లుగా అనేక పొంకనాలు కొట్టారు… ధాన్యం మొత్తం కేంద్ర మే కొంటుంది అని రైతులకు తెలిషింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగం కు పాల్పడుతోంది. ఎంఎంటీఎస్ గురించి మాట్లడరు. యాదాద్రి కి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టింది. బధ్రాద్రి కి రైలు పంపుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలుకూపలుకు లెదు. గిరిజన మ్యూజియం ఏర్పాటు కు స్పందన లేదు. రైతు ఉధ్యమం లో చనిపోయినా వారికి సాయం చేస్తా అంటున్నారు. మరి తెలంగాణ ఉధ్యమం.. రాష్ట్రలో చనిపోయిన రైతలు.. నిరుద్యోగులకు ఏ సాయం చేసారు. రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టె తగుదునమ్మా అంటూ ధర్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్వే లో వస్తున్న వ్యతిరేక ఫలితాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.


 


రైతులకు బాయిల్డ్ రైస్ కు సంభందం లేదు. ఏ మిల్లు లో ధాన్యం ఆడిస్తారో రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో స్టోరేజ్ బాధ్యత ఎవరిది.. కేంద్ర నిధుల తోనే ఇప్పుడు కొత్తగా వచ్చిన గోదాముల ను కట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు. కేంద్ర ప్రభుత్వం ఎ పథకం కు మోడీ ఫోటో పెట్టరు మీ ఇష్టం. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వం నం విమర్శిస్తలేరు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న విషప్రచారం అన్ని వర్గాలకు అర్థం అయ్యింది. పంజాబ్ లో ఎంతమంది రైతులు చనిపోయారో ఎక్కడ లెక్కలు లేవు. తెలంగాణలో వేలాది మంది రైతులు చనిపోయారు.. వారికి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో చెప్పాలి. బియ్యం కొనుగోలు చేయం అని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళారు అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.


మూడు రాజధానుల అంశంపై బీజేపీ గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయం వాస్తవమే అంటే సంతోషమే. గిరిజనులు.. ఎస్సీ లు రాష్ట్ర ప్రభుత్వం పై యుద్దం చేయాలి. ఎస్టీ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు.. కేంద్ర అనుమతి అవసరం లేదు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు అనువైన పరిస్థితి లేదని మేం మొదట్లోనే చెప్పాం. స్టీల్ తయారు చేస్తే దానికి ఎంఎస్పీ ఇవ్వాల్బి వస్తుంది. బండి సంజయ్ పై దాడి కి టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు.. ప్రజలే స్టెప్ తీసుకుంటారు. హుజూరాబాద్ గెలుపు దేశరాజకీయాలకు మలుపు అని తెలిపారు కిషన్ రెడ్డి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM