దివ్యాంగురాలిని ఆదర్శ వివాహం చేసుకున్న యువకుడు
 

by Suryaa Desk |

ప్రేమ పేరుతో వంచిస్తున్న ప్రస్తుత కాలంలో. ఓ యువకుడు దివ్యాంగురాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెద్దలు వద్దని వారించినా.... నడవలేని ఆమెను ఎత్తుకుని పెళ్లి పీటలపై కూర్చొబెట్టి మనువాడాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన వసంతరావు. మణుగూరు వాసి నరసమ్మను ఓ వివాహ వేడుకలో చూసి ప్రేమించాడు. నరసమ్మకు కాళ్లలో సమస్యతో నడవలేదు. అయినా... ప్రేమకి వైకల్యం అడ్డురాదంటూ ఆమెను వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన ఆమె... వదిన వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుని టైలర్ గా ఉపాధి పొందుతోంది. పెళ్లికి ఇరువర్గాల అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రేమజంట...జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం, దివ్యాంగ ఉద్యోగుల సంఘాన్ని ఆశ్రయించారు. స్పందించిన నాయకులు...కొత్తగూడెం రుద్రంపూర్ లోని దేవాలయంలో వీరికి ఆదర్శ వివాహం జరిపించారు.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM