భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
 

by Suryaa Desk |

తెలంగాణలోని మెదక్ జిల్లాలో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. భర్త చనిపోయిన 2 వారాల తర్వాత భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల మహేశ్వరి(25), రమేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రమేష్ అనారోగ్యంతో ఈ నెల 6న మృతి చెందాడు. ఈ క్రమంలో మానసిక వేదనకు గురైన మహేశ్వరి ఆదివారం ఉదయం పాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆమె నీటిలో మునిగిపోయింది. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 15 రోజుల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM