ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌
 

by Suryaa Desk |

సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. 3. 4 రోజులు హస్తినలో ఉంటారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. వరి సేకరణతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా సీఎం వివరణ కోరనున్నారు. వరి ధాన్యం ఎంత కొనుగోలు చేయాలనేది వార్షిక లక్ష్యమైతే. రాష్ట్ర రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటోంది. ఢిల్లీ పర్యటనపై కేంద్రం స్పందిస్తూ యాసంగి పంటలపై స్పష్టమైన ప్రకటన చేయనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం తేల్చలేదు. ఎస్సీ వర్గీకరణపై కూడా తేల్చాలని కోరనున్నారు. బీసీ జనాభా లెక్కలపైనా చర్చించే అవకాశం ఉంది. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు ఉన్నారు.


Latest News
తెలంగాణ కరోనా అప్డేట్ Wed, Dec 01, 2021, 09:21 PM
ఈ రోజు నుండి నూతన మద్యం పాలసీ అమలు Wed, Dec 01, 2021, 09:12 PM
నేరాల నియంత్రణకు డైనమిక్ పెట్రోలింగ్ వ్యవస్థ: సీపీ అంజనీకుమార్ Wed, Dec 01, 2021, 09:05 PM
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM