పది రోజుల్లో పెళ్లి ...అంతలో విషాదం
 

by Suryaa Desk |

మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన దయారి శ్రీకాంత్ రెడ్డి(28) హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 16న మండలానికి చెందిన బాలికతో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న బాలిక తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న వద్ద మొక్కు తీర్చుకునేందుకు వెళ్లారు. వారితో పాటు శ్రీకాంత్ రెడ్డి కూడా వెళ్లారు. 14న మొక్కులు చెల్లించుకుని 15న అదే ప్రాంతంలోని మరో ఆలయానికి వెళ్లారు. అదే రోజు బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. శ్రీకాంత్ రెడ్డి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శనివారం మృతి చెందారు.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM