తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

byసూర్య | Sun, Nov 21, 2021, 09:05 AM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులను పరిమితం చేస్తూ గతంలో జారీ చేసిన జీవో నెం.63కి సవరణలు చేశారు. ఇకపై రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. జీవో నెం.63 ప్రకారం సినిమా థియేటర్లు, మాల్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజులను ప్రభుత్వం నిషేధించింది. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. అయితే సినిమాకు వచ్చే వారితో పాటు ఇతర కార్యక్రమాలకు వచ్చే వారు కూడా థియేటర్ల పార్కింగ్ స్థలాల్లోనే పార్కింగ్ చేస్తున్నారని థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో వాహనాల పార్కింగ్‌, భద్రత సవాల్‌గా మారిందని విన్నవించారు. దీంతో థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది కేవలం థియేటర్లకు మాత్రమే వర్తిస్తుంది. మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో 'నో పార్కింగ్ ఫీజు' నిబంధన యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Latest News
 

స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM
బియ్యపు గింజ పై శ్రీరామ నామం Tue, Apr 16, 2024, 11:27 AM
వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM