అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు : రేణుకా చౌదరి
 

by Suryaa Desk |

అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు.  సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదు.అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారి పై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదు..అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదు. కేవలం మన హుందాతనం,ప్రవర్తన మాత్రమే  శాశ్వతం.ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరం..ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోంది. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలి. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలి,ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలి అని  రేణుకా చౌదరి  తెలిపారు 


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM