ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు
 

by Suryaa Desk |

రోజుకు రూ.50వేలు కడతారా?..ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు షాక్.జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో వాయిదా కోరిన జగన్ తరపు న్యాయవాదిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  వాయిదా కావాలంటే రోజుకు రూ.50వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.


జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో వాయిదా కోరిన లాయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వాయిదా కోరితే రూ.50 వేలు చెల్లించాలని ఆదేశం.జగన్‌ అక్రమాస్తుల విచారణలో భాగంగా ఆయన తరపు న్యాయవాదిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ వ్యవహారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణలో వాయిదా కోరితే రోజుకు రూ.50 వేలు ఖర్చుల కింద చెల్లించాల్సి ఉంటుందంటూ గురువారం స్పష్టం చేసింది.                     జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై కేసులను కొట్టి వేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు.


 


ఈ నేపథ్యంలోనే జాబితా వారీగా కేసు విచారణకు పిలవగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్‌ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి న్యాయవాది గడువు కోరారు.    అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు మినహాయింపుపై దాఖలు చేసిన పిటిషన్‌లలో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఒక్క రోజు వాయిదా వేయాలని జగన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ కోరారు.దీంతో జగన్ తరపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ కేసులు విచారణకు వచ్చినప్పుడు వాదనలు వినిపించాల్సిందేనని స్పష్టం చేశారు.    వాయిదా కోరితే కోర్టు ఖర్చుల కింద హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించారు. 


అనంతరం వాన్‌పిక్‌ కేసులో ఆరో నిందితుడైన ఐఆర్‌ఏస్‌ మాజీ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కొంత సేపు వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.


Latest News
నేరాల నియంత్రణకు డైనమిక్ పెట్రోలింగ్ వ్యవస్థ: సీపీ అంజనీకుమార్ Wed, Dec 01, 2021, 09:05 PM
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM
త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..? Wed, Dec 01, 2021, 07:18 PM
రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు Wed, Dec 01, 2021, 07:08 PM