ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
 

by Suryaa Desk |

శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని దర్గా వద్దకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మీర్జా కుర్రం తన మనవడు మహ్మద్ ఇమ్రాన్‌తో కలిసి దేవునిపల్లి నుంచి టేక్రియాల్ దర్గాకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డి నుంచి టేక్రియాల్‌ వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ వేగంగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ ముందు కూర్చున్న ఇమ్రాన్ కిందకు దూకాడు. తలకు బలమైన గాయమై ముక్కు నుంచి రక్తం కారడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న  కుర్రంకి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM