నవంబర్ 27న సీపీఐ బంద్‌కు పిలుపు
 

by Suryaa Desk |

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన మర్ధిటోల అమరవీరుల స్మారకార్థం ఈనెల 27న బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు శుక్రవారం పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు బంద్‌కు మద్దతు ఇచ్చి పెద్దఎత్తున విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు, పార్టీ యూనిట్లు, పీఎల్‌జీఏ యూనిట్లు ర్యాలీలు నిర్వహించనున్నాయని పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మర్ధిటోల ఫారెస్ట్‌లో పార్టీ సీనియర్ నాయకులు దీపక్ దా, మహేష్, లోకేష్, దిలీప్ తదితరులు ధైర్యంగా పోరాడి పోలీసు బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారని అన్నారు.


Latest News
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM