భార్యని దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌
 

by Suryaa Desk |

తన జీవితానికి నీడగా ఉంటానని అనుకున్న భర్త తన భార్యను తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్ రాజేంద్రనగర్ సర్కిల్ స్టేషన్ లో నివాసముంటున్న జంగయ్య(55), మీనా(47) దంపతులకు ముగ్గురు సంతానం. అయితే గత కొన్ని రోజులుగా జంగయ్య మానసిక స్థితితోపాటు ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ విషయమై జంగయ్య, మీనా మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో జంగయ్య మీనా తలపై బండరాయితో కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మనీ ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలింది. విషయం తెలుసుకున్న స్థానికులు మీనాను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మీనా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జంగయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జంగయ్య కూడా గతంలో ఓ హత్య కేసులో నిందితుడు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM