స్మార్ట్ పోలీసింగ్ సర్వీస్ లో ఏపీ పోలీస్‌కు తొలిస్థానం.. మరి తెలంగాణ..?
 

by Suryaa Desk |

దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది.
స్మార్ట్ పోలీసింగ్ సర్వే 2021ని ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ విడుదల చేసింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించారు. పలు అంశాల్లో తెలుగు రాష్టాలకు ప్రథమ, ద్వితీయ స్థానాలు లభించాయి.స్మార్ట్ పోలీసింగ్ అన్ని అంశాల్లో ఏపీకి తొలి స్థానం, తెలంగాణకు రెండో స్థానం లభించింది. అవినీతి రహిత సేవల్లో కేరళ పోలీసింగ్‌కు మొదటిస్థానం, ఏపీకి రెండోస్థానం, మూడోస్థానంలో తెలంగాణ నిలిచాయి. పోలీసు సెన్స్టివిటీ, సత్ ప్రవర్తనలో తెలంగాణ పోలీసుకు మొదటి స్థానం . ఇంకా జవాబుదారీతనం ప్రజల్లో విశ్వాసం విభాగంలో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం లభించాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతికతలోను  ఏపీ తొలిస్థానాన్ని సంపాదించుకుంది.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM