నేడు తెలంగాణ రాష్ట్ర బంద్!

byసూర్య | Wed, Oct 27, 2021, 09:29 AM

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల మృతికి నిరసనగా బంద్ కు మావోయిస్టులు నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు బంద్‌ కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కి నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అన్న హెచ్చరికలు మన్యంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పోలీసులు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏక్షణం ఎలాంటి చర్యలకు పాల్పడతారోనని మన్య ప్రాంతాలు వణికి పోతున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దు చిట్టచివరి గ్రామమైన వాజేడు మండలం టేకుల గూడెం నుండి చెరుకూరు వరకు తనిఖీలు చేపట్టారు. సరిహద్దు గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వారం రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని నేతలకు సూచించినట్టు సమాచారం. మావోయిస్టు బంద్‌ వేళ ఏం జరుగుతుందోని ఏజెన్సీ వాసులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.


Latest News
 

నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM
తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM