టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కీలక సూచన

byసూర్య | Wed, Oct 27, 2021, 09:01 AM

హుజూరాబాద్‌ లో ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ వెళ్లడం లేదు. ఈసీ నిబంధనల మేరకు బుధవారం రాత్రి 7 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈసీ నిబంధనల కారణంగానే తాము సీఎం కేసీఆర్‌ సభను నిర్వహించలేకపోయామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విలేకరులకు తెలిపారు. హుజూరాబాద్‌ లో చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తాలని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరుకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ కు ఓటు వేసేలా అభ్యర్థించాలన్నారు. బుధవారం తెల్లవారుజామున పార్టీ నేతలతో మరోసారి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM