మరో 20ఏళ్లపాటు అధికారంలో తెరాస: శ్రీనివాస్‌గౌడ్‌

byసూర్య | Wed, Oct 27, 2021, 07:34 AM

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ప్లీనరీ నిర్వహణతో తెరాస మరో 20ఏళ్లపాటు అధికారంలో ఉంటుందనే భరోసా కలిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు తమకు కావాలని ఏపీ సహా పలు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీసీ గణన జరిగి వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయనే కాంగ్రెస్‌, భాజపాలకు సీఎం కేసీఆర్ అంటే భయమన్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమర్థుడు కనుకనే సదస్సులో ప్రసంగించాని ఫ్రాన్స్‌ దేశం ఆహ్వానించిందని. ఇందులో పైరవీలు ఉంటాయా? అని మంత్రి ప్రశ్నించారు. దళితబంధును చూసి ఓర్వలేకే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు తెరాస పాలనలో మేలు జరుగుతోందన్నారు. తమ పునాదులు కదిలిపోతాయనే భయంతోనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బహిరంగ చర్చ అంటున్నారని. ఎన్నికలుండగా ఇంకా చర్చలెందుకన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కొలమానమని. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితమే ఎవరేంటనేది తేలుస్తుందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస గెలుపు ఖాయమన్నారు. ఉద్యోగ నియామకాలపై త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి వివరించారు.


Latest News
 

కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:03 PM