హైదరాబాదీలకు అలెర్ట్.. పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం

byసూర్య | Tue, Oct 26, 2021, 07:32 PM

తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం (ఎండబ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2లో కలాబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు, కంది గ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఆ కారణంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది.


తేదీ: 29.10.2021 శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేదీ: 30.10.2021 శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ 36 గంటలపాటు మంజీరా డ్రింకింగ్‌ వాటర్ సప్లై స్కీం(ఎండబ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2 పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.


అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:


1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9: హైదర్‌నగర్‌, రాం నరేష్‌నగర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌, వసంత్ నగర్‌, ఎస్‌పీనగర్ తదితర ప్రాంతాలు.


2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15: మియాపూర్‌, దీప్తినగర్‌, శ్రీనగర్‌, మాతృశ్రీనగర్‌, లక్ష్మీనగర్‌, జేపీ నగర్‌, చందానగర్ తదితర ప్రాంతాలు.


3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 23: నిజాంపేట్‌, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్‌.


4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 32: బొల్లారం.


కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదారాబాద్ జలమండలి అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM