వరంగల్ ను వణికిస్తున్న ఆంత్రాక్స్ .. నాలుగు గొర్రెలు మృతి

byసూర్య | Tue, Oct 26, 2021, 06:43 PM

వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్న గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు.


ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM