ధాన్యం సేకరణ పై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలు.. స్పందించిన రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, Oct 26, 2021, 02:34 PM

రైతులు వరిని పండించే అవకాశం లేనప్పుడు ప్రభుత్వం లక్షకోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఎందుకు కట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎంఓ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని అమ్మిన షాపులను సీజ్ చేస్తామని, వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తామని, సుప్రీం కోర్ట్ నుంచి అనుమతులు తెచ్చిన వదిలేది లేదని కలెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కలెక్టర్ సుప్రీం కోర్ట్ కన్నా సుప్రీమా..? అని ప్రశ్నించారు.


ప్రభుత్వం రైతుల ధాన్యం సేకరణ బాధ్యత నుంచి చేతులెత్తేసేలా ఎత్తుగడలు వేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే యాసంగి కాలంలో వరి పంటను చేస్తే లాభదాయకంగా ఉండదని, రైతులు ప్రత్యామ్నాాయ పంటలు వేసేలా చేసేందుకే కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని కలెక్టర్ వివరణ ఇచ్చారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM