సీమ చింతకాయలు తింటే ఎన్నో లాభాలు

byసూర్య | Tue, Oct 26, 2021, 12:23 PM

సీమ చింతకాయలు తింటే ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- సీమ చింత గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.


- సీమ చింత విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.


- క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.


- సీమ చింతకాయలలో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.


- సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది.


- సీమ చింతలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను అరికడతాయి.


- గర్భిణీ స్త్రీలకు సీమ చింత తింటే మంచి పోషకాలు లభిస్తాయి. సీమ చింత నీరసం తగ్గిస్తుంది


- సీమ చింత కాయలలో ఉన్న క్యాల్షియం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా ధృడంగా ఉంచుతుంది.


- ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM