వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్

byసూర్య | Tue, Oct 26, 2021, 11:19 AM

కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్‌, పెన్షన్ కట్ చేస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు.


రేషన్ తీసుకోవాలంటే బీపీఎల్ దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ కార్డుదారులు విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోనివారికి పింఛన్ రాదని స్పష్టం చేశారు.దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో కూడా రెండు కోట్ల డోసులుకు దగ్గరగా ఉంది. కానీ, 60లక్షలకు పైగా ప్రజలు ఒక్క డోసు కూడా వేయించుకోలదేని, వారికోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు శ్రీనివాసరావు.నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం నమోదువుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో దాదాపుగా అందరూ ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోనివారే ఉన్నారని శ్రీనివాసరావు వివరించారు.వ్యాక్సిన్ తీసుకోని వారికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మూడో వేవ్ రాకుండా ఉండాలంటే, వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అన్నారు.


 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM