తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

byసూర్య | Tue, Oct 26, 2021, 09:51 AM

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిజామాబాద్ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్.. తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ కల్లు వ్యాపారి ఇచ్చిన పిర్యాదుతో నిజామాబాద్ పోలీసులు ఈ నెల 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పు సంతోష్‌ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు. పోలీసులు.. సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ఆ సమయంలో మల్లన్న చంచల్‌గూడ జైలుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దాంతో నిజామాబాద్ పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిలో మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.


Latest News
 

ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం Thu, Apr 18, 2024, 08:55 PM