హైద‌రాబాద్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి

byసూర్య | Tue, Oct 26, 2021, 08:36 AM

పదిహేనేళ్ల‌ బాలికపై ఓ 16 ఏళ్ల‌ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సైదాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఐఎస్‌సదన్ డివిజన్‌లోని ఓ బస్తీలో ఉండే బాలిక(15) అదే ప్రాంతంలో ఉండే బాలుడు(16) వారి కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అయితే బాలికపై ఆ బాలుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాంతో బాలిక ఐదు నెలల గర్భవతి అని గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి, కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM