చర్మానికి మేలు చేసే ఆహారాలివే

byసూర్య | Tue, Oct 26, 2021, 08:32 AM

మొటిమలు, మచ్చలు లేని చర్మం కావాలనుకునేవారు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చర్మానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి. చర్మానికి మేలు చేసే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- చర్మంలోని మెలానిన్‌ అనే పదార్థానికి పిగ్మెంట్‌ పవర్‌ కోసం క్యాబేజీ, పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు తినాలి. వీటిని తినడం వలన పిగ్మెంటేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.


- దానిమ్మ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లను తీసుకోవాలి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్నే కాదు, గుండె జబ్బులను కూడా దూరం చేస్తాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ను కూడా నివారిస్తాయి.


- పెరుగులోని క్యాల్షియం, ప్రొటీన్‌ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. చర్మం ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. మచ్చలు, దురదను దూరం చేస్తాయి.


- ముఖం మృదువుగా, కాంతివంతంగా కనపడాలంటే శరీరానికి సరిపడా నీళ్లు అందాలి. వ్యాయామం చేస్తే చెమట వస్తుంది. అలా చెమట రూపంలో మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతే చర్మం బాగుంటుంది. నీళ్లు మొటిమలు రాకుండా నీళ్లు అడ్డుకుంటాయి.


- యాపిల్‌ లోని పెక్టిన్‌ అనే పదార్థం మొటిమలతో పోరాడుతుంది.


- పెరుగులోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి.


- నిమ్మరసం శరీరంలోని మలినాలను బయటికి పంపుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.


- పుచ్చకాయలోని విటమిన్‌-ఎ,బి,సి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా చేస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను దూరం చేస్తాయి.


- అవకాడోలోని విటమిన్‌-ఇ చర్మాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. మాయిశ్చరైజ్‌ చేస్తుంది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM