దళిత బంధు పిటిషన్ పై ముగిసిన వాదనలు

byసూర్య | Tue, Oct 26, 2021, 08:03 AM

దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్‌లు దాఖలు కాగా సోమవారం అందుకు సంబంధించి వాదనలు ముగిశాయి. ప్రస్తుతం తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని కోరారు. ఈ పథకాన్ని ఆపడం వల్ల చాలామంది వెనుకబడిన వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM
నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM