1500 కుటుంబాలను ఆదుకుంటామని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. వారు అడ్రస్ లేరని రాస్తారా: రేవంత్

byసూర్య | Mon, Oct 25, 2021, 08:07 PM

ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు.


''ఓయూకు ఎంత నిధులు కేటాయించారో చర్చించుకుందాం రండి. యువతను ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో లక్షా 7 వేల ఖాళీలున్నాయని చెప్పారు. బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ లున్నాయని చెప్పింది. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై చర్చిద్దమా?. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంత కలిసి పోరాటం చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించడంలేదు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్‌పై పెట్టిన కేసులు తొలగించుకున్నారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడంలేదు. తొలి, మలి దశలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎందుకు న్యాయం చేయడం లేదు.1500 కుటుంబాలను ఆదుకుంటామని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గుర్తించిన 500 కుటుంబాలకు కూడా సరైన న్యాయం చేయలేదు. కొందరు అడ్రస్ లేరని రాశారు. ఎంత అన్యాయం.'' అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM