చార్మినార్ వద్ద స్వచ్చ భారత్ కార్యక్రమం..

byసూర్య | Mon, Oct 25, 2021, 07:24 PM

చార్మినార్​లో నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్​ ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్​ మహోత్సవ్​ సందర్భంగా సోమవారం స్వచ్చభారత్​ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ యువకేంద్ర రంగారెడ్డి, ఎన్​ఎస్​ఎస్​ సహకారంతో జరిగిన కార్యక్రమానికి బెంగుళూరు, సౌత్​ జోన్​ నెహ్రూ యువకేంద్ర సంఘం రీజనల్​ డైరెక్టర్ సత్యప్రకాష్​ పట్నాయక్​ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ యువకేంద్ర జిల్లా యూత్​ ఆఫీసర్​ ఖుష్బు గుప్త క్లీన్​ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చార్మినార్​ పరిసరాలను ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థులతో కలిసి శుభ్రపరిచారు. చార్మినార్​ పరిసరాలలో పేరుకు పోయిన 1980 కిలోల ప్లాస్టిక్​ను తొలగించారు.


ఈ సందర్భంగా సత్యప్రకాష్​ పట్నాయక్ మాట్లాడుతూ.. అక్టోబర్​ 31 వరకూ స్వచ్చభారత్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​ సోహైల్​ ఖాద్రి, నెహ్రూ యువకేంద్ర సంఘం రాష్ట్ర డైరెక్టర్​ అంశుమాన్​ ప్రసాద్​ దాస్​, సెట్విన్​ మేనేజింగ్​ డైరెక్టర్​ వేణుగోపాల్, సౌత్​ జోన్​ డిప్యూటి కమిషనర్​ ఎస్​ఎన్​ సూర్యకుమార్​, జీహెచ్​ఎంసి ఎలక్ట్రికల్ డిఇఇ ఎ.శ్రీనివాస్​, నెహ్రూ యువకేంద్ర అసిస్టెంట్​ డైరెక్టర్​ జి.రాజేష్​, ప్రతినిధులు ఐసయ్య, వి.చంద్రశేఖర్​, ఆర్​.వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM