ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్: మంత్రి హరీశ్‌రావు

byసూర్య | Mon, Oct 25, 2021, 06:34 PM

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్ అని ప్రశంసించారు.


ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్ అని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, ప్రజల ఇంటి పార్టీగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో సారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కేసీఆర్‌కు హరీశ్‌రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM