ప్లీనరీలో కేసీఆర్ హాట్ కామెంట్స్..

byసూర్య | Mon, Oct 25, 2021, 03:40 PM

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్ 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. తెలంగాణా ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.


ఆనాడు తెలంగాణ ఉద్యమంపై అపనమ్మకం, గమ్యం పై స్పష్టత లేని పరిస్థితి ఉండేవని అలాంటి అగమ్యగోచర స్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకుందని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు ,అపోహలు, దుష్ప్రచారాల మధ్య టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది అని అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు కొంతమంది మిత్రులతో ఉద్యమం ప్రారంభమైనదని చెప్పిన కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని, స్వాతంత్రోద్యమ పోరాటంతో పోల్చి చెప్పారు... ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని, బాటను చూపింది తెలంగాణా ఉద్యమం. 


నాడు స్వాతంత్రోద్యమం లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదని, పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే అంతిమంగా విజయం సాధించిందని, తెలంగాణ పోరాటం కూడా అదే కోవకు చెందుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాడు సమైక్య పాలకులు ఎన్నో నిందలు వేశారని ఎన్నో ముప్పతిప్పలు పెట్టారని చివరకు రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ తెలంగాణ ప్రజలు అంతే పట్టుదలతో ముందుకు సాగి, అహింసాయుత మార్గంలో పోరాటం చేసి విజయం సాధించకున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.


ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని, బాటను నిర్దేశించగలిగామని పేర్కొన్నారు. కెసిఆర్ చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతమైన కీర్తి ఉంటుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.


ఆంధ్రాలో పార్టీ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నారు.. 


ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. గతంలో తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని, భూముల ధరలు అన్ని పడిపోతాయని దుష్ప్రచారం చేశారని, కానీ ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.


 


ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారని పేర్కొన్న కేసీఆర్ తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి అంటూ పక్క రాష్ట్రాల దృష్టి తెలంగాణపై పడిందని వ్యాఖ్యానించారు.


ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గతంలో ఉపాధికోసం పాలమూరు నుంచి ముంబై వలస వెళ్లే వారిని అయితే ఇప్పుడు పాలమూరుకు వస్తున్నారు అంటూ కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోయారని, కొందరు పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతున్నారని పేర్కొన్న కెసిఆర్ సాహసం లేకుండా ఏ కార్యము సాధ్యం కాదని తేల్చి చెప్పారు.రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధించుకుందాం అని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటున్నామంటూ వివరించారు.


Latest News
 

విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. మార్చి 31 నుంచి వేసవి సెలవులు Fri, Mar 29, 2024, 08:05 PM
ఖమ్మం జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకలు Fri, Mar 29, 2024, 08:04 PM
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి Fri, Mar 29, 2024, 08:01 PM
ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. కదం తొక్కుదాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 07:57 PM
11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు Fri, Mar 29, 2024, 07:54 PM