రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

byసూర్య | Sun, Oct 24, 2021, 12:37 PM

హైదరాబాద్‌ నగరంలోని హైటెక్స్‌లో ఈనెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో హైటెక్స్‌ పరిసరాలలో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశారు.


నీరూస్‌, సైబర్‌ టవర్‌, మెటల్‌ చార్మినార్‌, గూగుల్‌(సీఐఐ), కొత్తగూడ జంక్షన్‌ రోడ్లు


మెటల్‌ చార్మినార్‌, ఖానామెట్‌, హైటెక్స్‌/హెచ్‌ఐసీసీ/ఎన్‌ఏటీ జంక్షన్లు, రోడ్లు


జేఎన్టీయూ, సైబర్‌ టవర్స్‌, బయో డైవర్శిటీ జంక్షన్లు


గచ్చిబౌలి, బొటానికల్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్లు


నీరూస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు రూట్‌లో వెళ్లే వారు సీఓడీ (అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌) నుంచి దుర్గం చెరువు, ఇన్‌ ఆర్బిట్‌ మాల్‌, ఐటీసీ కొహినూర్‌, ఐకియా, బయో డైవర్శిటీ, గచ్చిబౌలి, సైబర్‌ టవర్‌ జంక్షన్‌ వైపు


మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్స్‌, జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లే వారు రోలింగ్‌ హిల్స్‌ ఏఐజీ దవాఖాన, ఐకియా, ఇన్‌ ఆర్బిట్‌ మాల్‌, దుర్గం చెరువు రోడ్డులోకి వెళ్లాలి. సైబర్‌ టవర్‌ జంక్షన్‌కు వెళ్లొద్దని చెప్పారు. ఇక ఆర్సీపురం, చందానగర్‌ నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వెళ్లేవారు, బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐఐటీ గచ్చిబౌలి రూట్లలో వెళ్లాలని, మిగతా రూట్లలో వెళ్లొద్దని చెప్పారు.


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM