హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్...

byసూర్య | Sun, Jun 13, 2021, 11:33 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టింది. రోజు వారీ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. లాక్‌డౌన్‌కు ముందు వేల సంఖ్యలో నమోదు కాగా, ఇప్పుడు వందల సంఖ్యలో కేసులు ఉంటున్నాయి. ఈ నెల మొదట్లో కాస్త కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత క్రమంగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ఈ నెల 5 వరకు 245 నుంచి 318 కేసులు ఉండగా, ఆరో తేదీ నుంచి రెండు వందల లోపు కేసులే నమోదు అవుతున్నాయి. ఈనెల మొదటి వారంలో 1,751 మందికి వైరస్‌ రాగా, 8 నుంచి 12 వరకు 864 మందికి కరోనా సోకింది. ఈ నెలలో " 12వ తేదీ వరకు"  2,615 కేసులు నమోదయ్యాయి. మెల్లమెల్లగా వైరస్‌ తగ్గుదల ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా తగ్గిందని జాగ్రత్తలు విస్మరించవద్దన్నారు. అప్రమత్తంగా ఉంటే వైరస్‌ విస్తరించే ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం, చేతులు శుభ్రంగా సబ్బు పెట్టి కడుకోవడం వంటివి తప్పని సరిగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రదానంగా రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దని, మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM