జీహెచ్ఎంసీలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సర్వర్ సమస్య

byసూర్య | Sat, Jun 12, 2021, 01:43 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సర్వర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ సమస్యతో సీతాఫల్‌మండి వ్యాక్సిన్ కేంద్రం దగ్గర గందరగోళం నెలకొంది. రెండ్రోజులుగా సర్వర్ మొరాయిస్తుండడంతో స్లాట్ బుకింగ్ సమస్యకు అంతరాయం ఏర్పడుతోంది. సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తానికి.. ఒకే చోట వ్యాక్సిన్ పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఉదయం నుంచి కిలోమీటర్ల మేర క్యూ లైన్ కట్టారు. కొన్ని సెంటర్లలో వ్యాక్సిన్ కోసం బుకింగ్ చేసుకున్న వారికి సైతం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM