పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్..

byసూర్య | Sat, Jun 12, 2021, 09:53 AM

మీరు పసిడి కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. అదే విధంగా వెండి ధరలు కూడా పైపైకి చేరిపోయాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌ లో పసిడి పెరిగిపోయింది. ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పైకి కదిలింది. రూ.50,300కు చేరింది.


అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం అయితే రూ.300 పెరుగుదలతో రూ.46,100కి ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర క్షీణించింది. 0.90 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1879 డాలర్లకు దిగొచ్చింది.


ఇక వెండి గురించి చూస్తే.. స్థిరంగా కొనసాగిన వెండి రేటు ఈరోజు దూసుకుపోయింది. వెండి రేటు ఏకంగా రూ.1200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.77,300కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ లో వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 28.04 డాలర్లకు ఎగసింది.


 


ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటివి బంగారం పై ప్రభావం చూపిస్తాయన్న సంగతి తెలిసిందే.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM