కాకతీయ మెడికల్ కళాశాల దవాఖానలో ఓపీ సేవలు ప్రారంభం

byసూర్య | Fri, Jun 11, 2021, 05:00 PM

సీఎం కేసీఆర్‌ చొరవ వల్ల దవాఖానల లో రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తాజాగా వరంగల్‌ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా 150 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఔట్ పేషంట్ సేవలు ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల సూపర్ స్పెషాలిటీ దవాఖానను సందర్శించి తక్షణమే వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్‌ను పూర్తి స్థాయిలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.


నాన్ కొవిడ్ రోగులకు కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో నాన్ కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు చర్యలు చేపట్టి 9 విభాగాలలో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో పని చేయడానికి డాక్టర్లు, పారా మెడికల్, సాంకేతిక సిబ్బంది ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా ముగ్గురు సివిల్‌ సర్జన్లు, ఆర్‌ఎంవోలు, 16 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 7 మంది బ్రాడ్ స్పెషాలిటీ నిపుణులు, 134 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక పూర్తయిందని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సంధ్యారాణి తెలిపారు.


Latest News
 

భువనగిరి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు తరలిన సిపిఎం శ్రేణులు Fri, Apr 19, 2024, 01:18 PM
వడదెబ్బకు ఒకరి మృతి Fri, Apr 19, 2024, 01:14 PM
ఉదయ సముద్రానికి నీటి విడుదల నిలిపివేత Fri, Apr 19, 2024, 01:13 PM
డీజే వాహనం సీజ్ Fri, Apr 19, 2024, 01:11 PM
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM