రాగల 4 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

byసూర్య | Fri, Jun 11, 2021, 04:00 PM

తెలంగాణ  రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా, బెంగాల్‌లో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా ద్రోణి విస్తరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM