వర్షంలోనూ నైట్‌ కర్ఫ్యూ పర్యవేక్షణ.. పోలీసులకు స్ఫూర్తినిచ్చిన సీపీ అంజనీకుమార్‌

byసూర్య | Fri, Jun 11, 2021, 03:16 PM

హైదరాబాద్‌ నగరంలో గురువారం నుంచి అమలులోకి వచ్చిన నైట్‌ కర్ఫ్యూను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పర్యవేక్షించారు. ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని అంబర్‌పేట్‌, విద్యానగర్‌, కాచిగూడ, శివం రోడ్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన 100 పోలీస్‌ చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ కేబీఆర్‌ పార్కు వద్ద గొడుగు పట్టుకుని విధులు నిర్వర్తించారు. లాక్‌డౌన్‌, నైట్‌కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన పలువురు వాహనదారులకు జరిమానా విధించారు. 40 వాహనాలను సీజ్‌ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో కూడా విధులు నిర్వర్తించి పోలీసులకు సీపీ స్ఫూర్తినిచ్చారు. రాత్రి 7 నుంచి 9.30 వరకు చెక్‌ పోస్టులను తనిఖీ చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM