ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్‌​ సాయం!

byసూర్య | Thu, Jun 10, 2021, 04:01 PM

సినీ గేయ రయిత కందికొండ గిరి ఇటీవలే అనారోగ్యానికి గురయ్యాడు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కరోజు వైద్యానికే రూ.70 వేలకు పైగా ఖర్చవుతోందట. అతడి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు సాయం కోసం చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన కేటీఆర్‌ ఆయనకు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


కాగా కందికొండ గిరి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు తెలంగాణ యాసలో రాశాడు. దేశముదురు, పోకిరి, ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో వెయ్యికి పైచిలుకు పాటలు రాశాడు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM