ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం

byసూర్య | Thu, Jun 10, 2021, 10:38 AM

ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమవనుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ మధ్యాహ్నం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం పలు దేశాల్లో కనిపించనుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దర్శనమివ్వనుంది. మన దేశంలోని లద్ధాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఇక భారత్‌లో సూర్యగ్రహణం మధ్యాహ్నం ఒంటిగంట 42 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరుగంటల 41 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, రష్యా, గ్రీన్‌లాండ్‌లో కనిపించనుంది. ఈస్ట్‌ కోస్ట్, అప్పర్ మిడ్‌వెస్ట్ దేశాల ప్రజలకు పాక్షికంగా ఈ అద్భుతం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసెంబర్‌ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుందని ప్రకటించారు శాస్త్రవేత్తలు.


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM