జూరాలకు కొనసాగుతున్న వరద

byసూర్య | Thu, Jun 10, 2021, 09:47 AM

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. కాగా, ఎగువనుంచి 20,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇందులో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 5,070 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM