తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో నేటినుంచి మార్పులు

byసూర్య | Thu, Jun 10, 2021, 09:13 AM

తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్ నిబంధనలు మారనున్నాయి. దీంతో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో.. గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. అయితే.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉన్న సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. అదనంగా ఇళ్లకు వెళ్లేందుకు 1 గంట సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. మేలో విధించిన లాక్‌డౌన్‌ నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బ్యాంకులు పనిచేశాయి. ఆ తర్వాత జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. తాజాగా.. ఈ రోజు నుంచి సడలింపు సమయాన్ని పెంచడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. బ్యాకింగ్‌ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ ప్రకటనను విడుదల చేసింది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM