టీసీఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

byసూర్య | Thu, Jun 10, 2021, 09:12 AM

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) జూన్ 5న గ్రేటర్ టొరెంటో నగరంలో ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా జనరల్ సెక్రటరి దామోదర్ రెడ్డి మాది ప్రారంభించగా.. అధ్యక్షులు రాజేశ్వర ఈద ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అధ్యక్షులు సంతోష్ గజవాడ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ రోకండ్ల సభికులతో కలిసి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం, ట్రెజరర్ నవీన్ ఆకుల, కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూత్ డైరెక్టర్ రాహుల్ బాలినేని, కుమారి ధాత్రి అంబటి సమన్వయ పరిచారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆపూర్వ శ్రీవాత్సవ్ హాజరై తమ సందేశాన్ని తెలియజేశారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాస్తవ్యులు ప్రదర్శించారు. సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ఈ కార్యక్రమంలో తన మిమిక్రీ, పాటలతో సభికులకు ఆటవిడుపు కలిగించారు. ఆయన కుమార్తె మోక్షిత రెడ్డి కూచిపూడి నాట్య ప్రదర్శన చేసి అలరించింది. సిరిసిల్ల జానపద కళాబృందం ఆకునూరి దేవయ్య ఆధ్వర్యంలో నక్క శ్రీకాంత్, డప్పు రాజు, కుమారి నాగలక్ష్మి, బాలు కయీతి తదితరలు తమ జానపద గీతాలు, ఒగ్గుకథతో ప్రేక్షకులను ఉత్సాహపరించారు.


 


ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తెలుగు కవి గోరెటి వెంకన్న తమ శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భరతనాట్యం, కరోనా దృష్ట్యా శాస్త్రీయ నృత్యం సభికులను మంత్ర ముగ్దులను చేశాయి. వెంకట జితేందర్ చుక్క, కుమారి రిషిమా గజవాడ, కుమారి వైష్ణవి ఈద టెక్నికల్‌ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. కార్యక్రమంలో వ్యవస్థాప సభ్యులు శ్రీనివాస్ తిరునగరి, విజయ్ కుమార్ తిరుమలాపురం, కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రమేష్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాథ్ రెడ్డి కుందూరి, హరి రాహుల్, ప్రభాకర్ కంబాలపల్లి, ప్రకాశ్ చిట్యాల, సయ్యద్ అతీక్ పాషా, అఖిలేష్ బెజ్జంకి, నవీన్ సూదిరెడ్డి, కలీమొద్దీన్ మహమూద్ తదితరలు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM