తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి

byసూర్య | Wed, Jun 09, 2021, 01:43 PM

వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి ఉచితంగా అందుబాటులో కి వస్తాయన్నారు. దీంతో ఎంతో మంది పేదలకు వైద్య ఖర్చుల భారం తప్పుతుందన్నారు.ఈ మేరకు జిల్లా ప్రజల తరుఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ , కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM