ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

byసూర్య | Wed, Jun 09, 2021, 08:46 AM

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది. ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది. రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశిస్తున్నాయి.


3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు:


నైరుతి రుతుపవనాలు రెండు రోజులుగా మందగించాయి. కేరళ తీరం నుంచి ముందుకు కదలిన రుతుపవనాలు ఈ నెల 6 వరకు చురుకుగా ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమ గాలులు బలంగా లేకపోవడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోనే విస్తరించాయి. అయితే ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున రుతుపవనాలు వేగం పుంజుకోవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


 


రాగల 48గంటల్లో వానలు:


రాష్ట్రంలో రుతుపవనాలు ఇప్పటివరకు మెదక్‌, నల్లగొండ జిల్లాలలో మాత్రమే ప్రవేశించాయి. మరోవైపు మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్‌ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. ఇదిలా ఉండగా రాగల 48గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకి 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.


 


బంగాళాఖాతంలో అల్పపీడనం:


ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు.


 


గ్రేటర్‌లో విస్తారంగా వానలు:


గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ నెల 11నుంచి వానలు విస్తారంగా కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో నేడు, రేపు నగరంలోని కొన్ని చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. రుతుపవనాల రాకతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.


Latest News
 

మండలాల ఇంచార్జీల నియామకం Fri, Apr 19, 2024, 03:08 PM
బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యం Fri, Apr 19, 2024, 03:06 PM
సీఎం పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్ల రద్దు Fri, Apr 19, 2024, 03:04 PM
బీఫామ్ అందుకున్న బీఎంపీ అభ్యర్థి విజయ్ Fri, Apr 19, 2024, 03:01 PM
నేడు కురుమూర్తికి డీకే అరుణ రాక Fri, Apr 19, 2024, 02:55 PM