ఆన్‌లైన్‌ పోర్న్‌ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు

byసూర్య | Tue, Jun 08, 2021, 01:01 PM

డబ్బులు ఇవ్వకుంటే కుంటుంబ సభ్యుల ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా, నారాయణపేట మండలం, పల్లా అర్జున్‌వాడాకు చెందిన తుము భారత్‌కుమార్‌ "22 " ప్రస్తతం బీఏ చదువుతున్నాడు. నిందితుడు ఆన్‌లైన్‌ పోర్న్‌ సినిమాలకు బానిసయ్యాడు. ఆన్‌లైన్‌లో కాల్‌బాయ్‌ అని చెప్పుకుంటూ తన కాంటాక్ట్‌ నంబర్‌ను లోకాంటో, స్కోక్కా వంటి వివిధ వైబ్‌సైట్లలో ఫోన్‌ నంబర్‌ పోస్ట్‌ చేశాడు. అక్కడ ఉండి స్పందనలు రాకపోవడంతో నిందితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తికి గూగుల్‌ హ్యాంగ్‌అవుట్స్‌లో చాట్‌ చేయమని కోరాడు.


దీంతో కొన్ని రోజులు వారు చాట్‌ చేస్తూ బాధితుడి వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ సేకరించాడు. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ సృష్టించి అక్కడ నుంచి నిందితుడిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలు తన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భారత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM