నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. లాక్ డౌన్ పై క్లారిటీ ఇవ్వనున్న సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Jun 08, 2021, 10:10 AM

తెలంగాణ కేబినెట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకానుంది. రాష్ట్రంలో రేపటితో లాక్‌డౌన్ ముగియనుంది. ఈ క్రమంలో అన్‌లాక్‌ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపులు ఇస్తూ నైట్ కర్ఫ్హ్యు విధించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరుపనున్నారు.


వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయంపై కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించనున్నారు. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించనుంది. రేపటి నుంచి ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM