రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు ఏర్పాటు: మంత్రి కేటీఆర్‌

byసూర్య | Mon, Jun 07, 2021, 05:06 PM

పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘స్మశానవాటికల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించాం. తెలంగాణలో మున్సిపాలిటీలు 142కు చేరాయి. మెట్‌పల్లిలో రూ. 2.50కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నాం. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. 138 మున్సిపాలిటీల్లో రూ.500 కోట్లు మార్కెట్ల కోసమే ఖర్చు. మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నామని’ కేటీఆర్‌ పేర్కొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM