కేసీఆర్‌ను గద్దె దించే ఆయుధం నా దగ్గర ఉంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

byసూర్య | Mon, Jun 07, 2021, 03:02 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే మెడిసిన్ తన దగ్గర ఉందంటూ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు. తాను మాట్లాడేది కామెడీ కాదని, సీరియస్‌గా చెబుతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పీసీసీ చీఫ్ ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌పైనా వాగ్బాణాలు సంధించారు. నగరంలో సోమవారం మాట్లాడిన ఆయన..


''నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో నేను లేను. అది నా దురదృష్టం. ఠాగూర్ నాపై చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టం. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్‌ను అడ్డగించిన చరిత్ర నాది. ఇది ఠాగూర్‌కు తెలియక పోవడం నా దురదృష్టం. రాజకీయంగా కేసీఆర్‌ను అడ్డుకోవడం నాతోనే సాధ్యం. కేసీఆర్‌ను గద్దె దింపే మెడిసిన్ నా దగ్గర ఉంది. నేను చెబుతున్నది కామెడీ కాదు సీరియస్. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. ఇక వీహెచ్‌ను కొందరు బెదిరించడం సరికాదు. బెదిరించేవారు ఫోన్ నంబర్ పెట్టండి. నేను వచ్చి మాట్లాడతా. ఫేస్ బుక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటుంది'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM