"ఆస్క్ కేటీఆర్ " కార్యక్రమం పై నెటిజన్ల అసంతృప్తి.. కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేసిన నెటిజన్లు

byసూర్య | Mon, Jun 07, 2021, 01:54 PM

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా కొందరి సమస్యలను పరిష్కారిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో గట్టి షాక్ ఇచ్చారు నెటిజన్లు. ఆస్క్ కేటీఆర్ అంటూ ట్విట్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తీరును విమర్శలు గుప్పించారు. ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ప్రశ్నలు అడగాలని తానే కోరి.. తీరా తాము అడిగిన వాటికి సమాధానం ఎందుకు చెప్పడం లేదంటూ కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేశారు.


ఆదివారం ఆస్క్ కేటీఆర్' AskKTR పేరుతో రాత్రి ట్విట్టర్ సంభాషణ కార్యక్రమం నిర్వహించారు. నెటిజన్లు మంత్రిపై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెటిజన్స్ వందలాది ప్రశ్నలు వేశారు. అయితే కేటీఆర్ మాత్రం కొన్నింటికే సమాధానం చెప్పారు. కరోనా పరిస్థితుల్లో అంతా కరోనాకు సంబంధించినే ప్రశ్నలే ఎక్కువగా వేశారు. అయితే, కొందరు మాత్రం ఉద్యోగ నోఫికేషన్లపై ప్రశ్నలు సంధించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 50 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి కొందరు ఆయనను అడిగారు. అయితే ఆ ట్వీట్‌కు మంత్రి బదులివ్వకుండా మౌనంగానే ఉండిపోయారు. 'ఎన్నికలప్పుడు రాత్రికి రాత్రే డబ్బులు పంపిణీ చేస్తారు. ఆ విధంగా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు' అంటూ మరో నెటిజన్ పశ్నించారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM